Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ రైతాంగ సాయుధపోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరుతో మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ డిమాండ్ చేసింది. ఐలమ్మ 37 వర్ధంతిని ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో శనివారం నిర్వహిం చారు. ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్ఎఫ్ఐ ఓయూ అధ్యక్ష, కార్యదర్శులు అంజి, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు శ్రీను, మమత, అశ్వనీ, పవన్, కల్యాణ్, కష్ణ నాయకులు రాజు, సందీప్, జ్యోతి, పుష్ప, ప్రవళిక, నవనీత, నగేష్, మంజునాథ్, దిలీప్, యశ్వంత్, హరీష్, నరేష్, రాజేష్ పాల్గొన్నారు.
ఘట్కేసర్లో ఐలమ్మకు సీపీఐ(ఎం) ఘన నివాళులు
ఘట్కేసర్ సీఐటీయూ కార్యాల యంలో శనివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతల యాదయ్య వీరనారి ఐలమ్మ 37వ వర్ధంతి సభ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వర్ధంతి సభలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు, కె.చంద్రమోహన్, కె.అలివేల, సిహెచ్. మహేశ్వరి, సిహెచ్ అరుణ, బీహార్ సునీత, నిరజారెడ్డి డి.పోచయ్య ఇనాయతాన్, నరసింహ పాల్గొన్నారు.
బోడుప్పల్లో...
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలు శనివారంనాడు మేడిపల్లిలోని రజక ఆత్మగౌరవ భవన స్థల సముదాయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల ప్రతినిధులు పంజాగారి ఆంజనేయులు, అబ్బోల్ల నగేష్, పెద్దపూరం కుమారస్వామి పాల్గొన్నారు.
ఉప్పల్‌లో...చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా కార్పొ రేటర్ గీత ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివా ళులు అర్పించారు. చిల్కానగర్ డివిజన్ రజక సంఘం నాయ కులు మల్లేష్, కష్ణ, ఎలేంద్ర, రవి, లింగం, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ ఏదుల్ల కొండల్‌రెడ్డి, జీఎస్.జగన్, మాస శేఖర్, రామానుజం, ఎస్.కె.అబ్బు బారు, బాణాల, నారాయణరెడ్డి, ఫోటో బాలుగౌడ్, శ్యామ్ బాలు, మహిళా నాయకురాలు సుభద్ర, సరిత, లక్ష్మి పాల్గొన్నారు.
ట్యాంక్ బండ్‌పై ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలి
రజక వత్తిదారుల సంఘం
ట్యాంక్ బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు చేయాలని రజక వత్తిదారుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉపేందర్ చక్రపాణి అన్నారు. రజక వత్తిదారుల సంఘ కమిటీ ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సుభద్రమ్మ, సారయ్య, ఐద్వా మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎం.వినోద, ఉప్పల్ నాయకులు ఎన్.పద్మ, డి.గాయత్రి మెహర్, ఆర్.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తుర్కయాంజల్‌లో...
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి తుర్కయంజాల్ అంబేద్కర్ చౌరస్తాలో బహుజన్ సమాజ్ పార్టీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షులు వద్దిగాళ్ల బాబు ఆధ్వర్యం లో శనివారం చాకలి ఐలమ్మ 37వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ బీఎస్పీి నాయకులు జంతుక సైదులు, లాపంగి రాజు, మధునాయాక్, శంకర్‌నాయక్, పోచయ్య, సత్యం, బాబాయ్య, పట్నం రమేష్ కుర్మ తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట్లో.. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ధీరవనిత నేటి యువతకు ఆదర్శ మని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ పాల్గొని ఐలమ్మ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు టేకుల సుధాకర్ రెడ్డి, అనురాధ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సరూర్‌నగర్‌లో
చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలు ఆర్కే పురంలో టీఆర్ ఎస్ నాయకులు ఎల్లయ్య, కంచర్ల శేఖర్, శ్రీరాములు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథు లుగా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరవింద శర్మ, డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్‌లు హాజరై విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్, సాజీద్, లింగస్వామి గౌడ్, కొండ్ర శ్రీనివాస్, శేఖర్,పెంబర్తి శ్రీనివాస్, డివిజన్ ఉపాధ్యక్షుడు ముచింతల జగన్, దేవేందర్,శ్యాంసుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
నాగోల్‌లో....
రైతాంగ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ 37వ వర్ధంతిని నాగోల్ డివిజన్లోని సాయినగర్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక అభివద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసినివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మయ్య, శ్రీను, రామకష్ణ, మురళి, శ్రీనివాసులు, రాజేష్ ,లక్ష్మీనారాయణ, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.