Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలోని 29 రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం
- అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందిస్తాం
- సుభాష్‌నగర్ డివిజన్‌కు1205 మందికి ఆసరా పింఛన్ల పంపిణీలో
ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్‌కు చెందిన 1205 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ''ఆసరా పింఛన్ల కార్డులను'' శనివారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూరారం చౌరస్తా లోని భీమాగార్డెన్ ఫంక్షన్ హాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరికంతో బాధపడుతూ, అయినవాళ్లకు భారంగా మారుతున్నామనే భావనను వారిలో దూరం చేయడానికి సీఎం కేసీఆర్ ''ఆసరా పింఛన్ల పథకం'' అమలు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు పింఛన్ల పంపిణీ లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి దేశంలోని 29 రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ తన ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పథకం ప్రవేశపెట్టిందో తెలపాలని పేర్కొన్నారు. రాబోయే కాలంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.