Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
సెప్టెంబర్-17ను హైజాక్ చేస్తూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరుగున పడేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని పలువురు వక్తలు ఆరోపించారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 74వ వార్షికోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన మగ్ధూం మొయినుద్దీన్ విగ్రహానికి సీపీఐ నాయకులు ఆదివారం పూలమాలతో నివాళులు అర్పించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, సీపీఐ నాయకులు ఎన్.బాలమల్లేష్, ఉజ్జిని రత్నాకర్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నర సింహ, మేడ్చల్ జిల్లా కార్యదర్శి సాయిలు గౌడ్, రాష్ట్ర కార్యదర్శి ఎన్.జ్యోతి హాజరయ్యారు. అనంతరం డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ నాడు బ్రిటీష్ బూట్లు నాకితే, ప్రస్తుతం బీజేపీ శవాలపైన ఆటలాడుతోందని విమర్శిం చారు. సెప్టెంబర్-17ను హైజాక్ చేస్తూ, తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరుగున పడేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అనంతరం చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని బీజేపీ హిందూ, ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తోందని, ఈ పోరాటంలో అగ్రభాగాన ఉన్న మగ్ధుం మొయినుద్దీన్ ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరా టంలో అనేక మంది ముస్లింలు పాల్గొన్నారని గుర్తు చేశా రు. కమ్యూనిస్టులు చేపట్టిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతోనే నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ విలీనం చేశారన్నారు. అమరుల ఆశ యాలు, ఆకాంక్షలను పునికి పుచ్చుకోవాలని సూచించారు. సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాట చర్రితను ప్రతి ఒక్కరికీ చెప్పాలని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని వివరించాలని సూచించారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ నాటి కేంద్ర హోం శాఖ మంత్రి సర్ధార్ వల్లభారు పటేల్ నిషేధించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ తెలంగాణ సాయుధ పోరాట స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.క మ్యూనిస్టు పార్టీ త్యాగాలను గుర్తించాలన్నారు. పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లేకుండా హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్య్రం వచ్చేదే కాదని తెలిపారు.