Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భాగ్యనగర్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ అలీ జాఫర్
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా కొత్త పాలసీని తెచ్చి చిన్న కాంట్రాక్టర్ల జీవితాలను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కిశోర్ రోడ్డుకీడుస్తున్నారని భాగ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఏ.ప్రేమ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో వారు మాట్లాడుతూ జల మండలి పరిధిలో దాదాపు 600 పైగా చిన్న, చితకా కాంట్రాక్టర్లు తమ పనులను చేసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు తమ వంతు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఇదేకాకుండా ఆరు వందల కాంట్రాక్టర్ల కింద మరో ఆరు వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. జలమండలి ఎండీ దాన కిశోర్ రూపొందించిన కొత్త పాలసీలతో తమ కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ వద్ద డబ్బులు లేక నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దష్టికి తీసుకుని వెళితే వెంటనే కొత్త పాలసీకీ చెందిన టెండర్లను రద్దు చేయాలని కిశోర్‌కు లేఖ రాశారని తెలిపారు. అయితే లోక్‌సభ సభ్యుడి లేఖను వక్రీకరించి జీవో సంఖ్య 73 చూపిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కొత్త పాలసీలో రెండేండ్ల వరకు జల మండలితో ఒప్పందం చేసుకోవాలని ఉందని కాని ఇప్పటికే చిన్న కాంట్రాక్టర్లకు వచ్చే డబ్బులు ఇవ్వకుండా అప్పుడు ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు. ఈ కొత్త పాలసీల విషయమై సంబంధిత సీజీఎం, డీజీఎంలు, మేనేజర్లు కూడా ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారని అన్నారు. అయినాగాని సంబంధిత అధికారులు బయటికి కాంట్రాక్టర్లను తెచ్చి పనులు చేయిస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎండీ దాన కిశోర్ మానవతా దక్పథంతో కాంట్రాక్టర్లను, కార్మికులను దష్టిలో పెట్టుకుని కొత్త పాలసీ రద్దు చేసి బకాయిలను చెల్లించాలని కోరారు. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్‌ను తప్పుదోవ పట్టిస్తున్న వారిలో డీవోపీ కష్ణ ప్రధాన పాత్ర పోషించి 200 మంది కాంట్రాక్టర్లను అందలం ఎక్కించడానికి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు వి.వి.రావు, అతుల్ కుమార్, ఘన్ శ్యామ్, మురళి తదితరులు పాల్గొన్నారు.