Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు చింతల యాదయ్య, కపా సాగర్
నవతెలంగాణ-ఉప్పల్
అర్హులందరికీ దళితబంధు ఇవ్వాలని కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు చింతల యాదయ్య, కపా సాగర్ అన్నారు. ఆదివారం రామాంతపూర్ భరత్‌నగర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళిత బంధు పథకం మంచిదే అయినప్పటికీ పంపిణీలో అవకతవకలు లేకుండా అర్హులను గుర్తించాలని సూచించారు. ఈ స్కీం ద్వారా ప్రతి ఒక్కరికీ పది లక్షల రూపాయల ఆర్థిక ఉపాధి కల్పించాలని కోరారు. అనంతరం 20 మందితో దళితబంధు సాధన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ కన్వీనర్ నామాల శ్రీనివాస్, కో కన్వీనర్‌గా బాలయ్య ఎన్నికయ్యారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బాలు, శ్రీనివాస్, మల్లయ్య, వెంకటేశ్వర్లు, ఎర్రం శ్రీనివాస్, చలపతి, మంజుల, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.