Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఈనెల 22న సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న పీడీఎస్ఎఫ్ రాష్ట్ర సదస్సు-ర్యాలీని విజయంతం చేయాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (పీడీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు పిలుపునిచ్చారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట రాష్ట్ర కార్యవర్గసభ్యులు, విద్యార్థులతో కలిసి సదస్సు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్, కాషాయ మూకల కబంధహస్తాల నుంచి విద్యారంగాన్ని పరిరక్షించుకుందామన్నారు. ఈనెల 22న సూర్యాపేటలో జరిగే రాష్ట్ర సదస్సులో ముఖ్య వక్తగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సి.కాసీం పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై ర్యాలీ-సదస్సును జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.కుమార్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ చెనగోని గణేష్, సభ్యులు వి.రాకేష్, బి.నవీన్, టి గోపి, సందీప్, వెంకటేష్, సతీష్, కిట్టు, సురేష్, దీపక్, హేమంత్. విద్యార్థులు పాల్గొన్నారు.