Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.చింతల రాకేష్ భవాని
నవతెలంగాణ-హయత్‌నగర్
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని 2022 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన కాళోజీ విశిష్ట పురస్కారాన్ని కవి, రచయిత, గాయకులు, హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చింతల రాకేశ్ భవానికి తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు మంత్రి శ్రీదేవి, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మెన్ వకుళాభరణం కృష్ణ మోహన్‌రావు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాళేశ్వరం శంకరం, దైవజ్ఞ శర్మలు బహుకరించారు. ఈ సందర్భంగా డా. రాకేష్ భవాని మాట్లాడుతూ తెలంగాణ ధిక్కార స్వరం, ప్రజాకవి కాళోజీ పేరిట ఈ విశిష్ట పురస్కారానికి ఎంపిక చేసిన కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పురస్కారం భాషాభివృద్ధికై తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. రాకేశ్ భవాని తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించి వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని అనేక పత్ర సమర్పణలు చేశారు. 'తెలుగు సినీ గేయ సాహిత్యం సమకాలీన సమాజ చిత్రణ (1960-70)' అన్న అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2020లో డాక్టరేట్‌ను పొందారు. ప్రతిష్టాత్మక 'తానా' వారి ఆధ్వర్యంలో 21 దేశాలు పాల్గొన్న 'ప్రపంచ మహా కవిసమ్మళనం 21' లో భారతదేశం ప్రతినిధిగా నుండి నైజీరియా తెలుగు సంఘం తరపున పాల్గొని ప్రశంసలు పొందారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే 'దళితరత్న 2021' పురస్కారాన్ని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారాణా, గోరటి వెంకన్నచే అవార్డులు స్వీకరించారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞానప్రతిస్టాన్ సంస్థచే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రిచే ''విద్యాసేవారత్న 2021'' పురస్కారం పొందారు. జాతీయ సేవా పథక రంగారెడ్డి జిల్లా ప్రోగ్రాం అధికారిగా కోవిడ్ సమయంలో నోడల్ అధికారిగా కూడా పనిచేసి అధికారుల ప్రశంసలు పొందారు. రంగారెడ్డి జిల్లా నెహ్రూ యువకేంద్ర కమిటీలో సలహా సభ్యునిగా పనిచేసున్నట్లు గుర్తు చేశారు.