Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితుల భూములను దళితులకే ఇవ్వాలి
- సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్
- రెండవ రోజు కొనసాగిన బైక్ ర్యాలీ
నవతెలంగాణ-మీర్పేట్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు నడుద్దామని రంగారెడ్డి జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రహితంగా పోరాట వజ్రోత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ రెండోరోజు వివిధ గ్రామాలు పట్టణాల తిరుగుతూ మీర్ పేట్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగండ్ల భాస్కర్ మాట్లాడుతూ నాడు భూమికోసం భుక్తి కోసం దున్నే వాడికి భూమి కావాలని నినాదంతో పెత్తందారులు భూస్వాములు దొర్లకు వ్యతిరేకంగా రైతులు పేదలు పెద్ద ఎత్తున పోరాటం చేశారని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణకు స్వాతంత్రం రాకపోవడం కారణం నాటి నైజాం భూస్వామ్య వ్యవస్థనే కారణమని చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా పేదలకు వేల ఎకరాలను పంచిన ఘనత ఉందని అన్నారు. నేడు బీజేపీ చరిత్రను వక్రీకరించి తెలంగాణ విమోచన దినంగా జరపాలని తెలంగాణ సాయుధ రైతన్న పోరాటం సంబంధం వ్యక్తులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం కేవలం కమ్యూనిస్టులు ప్రజలను ఏకం చేసి నడిపిన పోరాటం కమ్యూనిస్టులకే దక్కుతుందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటూ బతుకుతున్న దళితుల భూము లను దళితులకే ఇవ్వాలన్నారు. ప్రభుత్వం, అధికారులు ఆ భూమి దళితులకే చెందేలా చొరవ తీసుకోవాలని కోరారు. విపక్ష పార్టీలు బీజేపీ చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యొక్క విశేషాలను ప్రజలకు తెలిపేందుకు యాత్ర నడిపిస్తున్నట్టు తెలియజేశారు. చివరి రోజు 17వ తేదీన మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోర్యాలీ ముగింపు సభ ఉంటుందని ఆ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సామేలు, డి జగదీష్, శ్రీనివాస్ రెడ్డి, శ్యామ్, జంగయ్య, మండల కార్యదర్శి యాదయ్య, దాసరి బాబు, ప్రకాష్, కేవీపీఎస్ నాయకులు ప్రకాష్ కారత్, ఎస్ఎఫ్ఐ నాయకులు శంకర్, జగన్, ప్రజానాట్యమండలి కళాకారులు వినోద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.