Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
అసెంబ్లీ సాక్షిగా కొత్త పార్లమెంట్ భవనానికి డా.బీఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అశేష ప్రజల తరపున హదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ప్రజాగాయకుడు గద్దర్, ఆల్ ఇండియా కన్ఫడరేషన్ ఎస్సీ, ఎస్టీ అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ అన్నారు. ఇక ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పులు వద్దని సూచించారు. సోమవారం సోమాజిగూడా ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగాల ద్వారా తెలంగాణ, దేశం ఎలా ఉండాలో ఇప్పుడు ఎలా ఉందో అద్భుతంగా వివరిస్తారని చెప్పారు. అసెంబ్లీలో డా.బీఆర్ అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పారని, సీఎం ఈ ఉద్యమానికి మరింత ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.