Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఫర్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ 8వ ఎడిషన్ ఈనెల 21 నుంచి 23 వరకు జరగనుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ, సీడీఎస్ సీఓ సహకారంతో ఫార్మాసుటికల్స్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) ఈ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. సోమవారం బంజారాహిల్స్‌లోని తాజ్ కష్ణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ దాదాపు 200 దేశాలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను సరఫరా చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణకు గణనీయమైన సహకారం అందించడంలో భారతీయ ఫార్మా పరిశ్రమ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందని, అందుకే దీనిని 'ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్' అని పిలుస్తారని తెలిపారు. 2013లో తొలిసారిగా ఐపీహెచ్ ఈఎక్స్పోను నిర్వహించారని, తర్వాతి 7 ఎడిషన్లు ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల్లో విజయవంతంగా జరిగాయని చెప్పారు. రెగ్యులేటరీ అధికారులు, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలు, 100కి పైగా దేశాల నుంచి దిగుమతిదారులు, 3500 మంది ఎగ్జిబిటర్లు, 4500 మంది విదేశీ ప్రతినిధులు, లక్షమందికి పైగా సందర్శకులు వీటికి హాజరయ్యారని తెలిపారు. 75 ఏండ్ల భారత స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఎడిషన్ ఇది అని, ఎగ్జిబిషన్, బిజినెస్ మీటింగులకు 120కి పైగా దేశాల ప్రతినిధులను ఆహ్వానించే 'గ్లోబల్ రెగ్యులేటర్స్ కాన్ క్లేవ్' అన్నారు. ఈ ఎగ్జిబిషన్ వ్యాపార సహకారం, సాంకేతిక బదిలీని అన్వేషించడానికి అద్భుతమైన అవకాశాలను అందిస్తుందన్నారు. అంతర్జాతీయ రెగ్యులేటరీ కన్వర్జెన్స్ టు ప్రమోట్ యాక్సెసిబిలిటీ అండ్ క్వాలిటీ మెడిసిన్స్ అనేది ఈ కాన్ క్లేవ్ థీమ్‌గా నిర్ణయించారని వివరించారు.