Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ పాండురంగారెడ్డి అన్నారు. సోమవారం చైర్మెన్ ఛాంబర్లో తెలంగాణ ప్రజా గ్రంథాలయాల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు కొక్కుల దేవేందర్, ప్రధాన కార్యదర్శి దాచేపల్లి బుచ్చయ్య, కార్యదర్శి సోమ శివయ్య కలిసి రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజక వర్గంలోని అత్తాపూర్‌లో శాఖా గ్రంథాలయం ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజే శారు. దీనికి చైర్మెన్ సానుకూలంగా స్పందించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో అత్తాపూ ర్లో గ్రంథాలయం ఏర్పాటు చేయుటకు కృషి చేస్తాననీ, ముందుగా జిల్లాలో పౌర పఠన మందిరం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. అనంతరం తెలంగాణ ప్రజా గ్రంథాలయ అభివృద్ధి సంఘం నాయకులు పాండురంగా రెడ్డిని పూలమాలలు, శాలువాతో సన్మానించారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.మనోజ్ కుమార్, సిబ్బంది సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.