Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సీఎం కేసీఆర్కు మునుగోడు ఎన్నికలపై చూపిస్తున్న శ్రద్ధ విద్యాభివృద్ధిపై లేదని పీడీఎస్యూ నాయకులు అన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలువు మేరకు పీజీ కళాశాల విద్యార్థులతో కలిసి సీడీఎస్యూ నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయడంలో ఆలస్యం చేస్తుండటంతో ఫీజులు చెల్లించలేక విద్యార్థులు చదువు మానేసి పనులు చేసుకునే దుస్థితి ఏర్పడిందన్నా రు. పెరిగిన ధరలకు అనుకూలంగా హాస్టల్ మెస్ చార్జీల ను పెంచాలనీ, ఇంజినీరింగ్ ఫీజులనూ తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే విద్యార్థి ఉద్యమాలను చేపడతరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ అధ్యక్షులు భాను, కళాశాల అధ్యక్షులు రాజేష్, వైస్ ప్రెస ిడెంట్ కావ్య శివసాయి, శివకుమార్, రాకేష్, మౌనిక, నరేష్ రవిరాజా, రమ్య ఐశ్వర్య, క్రితిక, అనిల్ పాల్గొన్నారు.