Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్
- రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మచ్చా రంగయ్య
- మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా
- అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మచ్చా రంగయ్య అన్నారు. అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యా లయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా కన్వీనర్ పి.నా రాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో మచ్చా రంగయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ, హామీ ఇచ్చిన జీవోలను సత్వరం విడు దల చేయాలని డిమాండ్ చేశారు. కనీస పెన్షన్ రూ.9వేలు, ధరల పెరుగుదలకు అనుగుణంగా పెంచాల న్నారు. హైయ్యర్ పెన్షన్ పై కేరళ హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం ఉచిత వైద్య వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈపీఎఫ్ఓ, సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్లు ఉపసంహరించాలనీ, ఏక పక్షంగా ఉపసంహరించిన ప్రయోజనాలు పునరుద్ధరించాలన్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహ్మ రెడ్డికి వినతిపత్రం అందజే శారు. ఈ ధర్నాలో ఎస్.హమ్మయ్య, బి.లక్ష్మినర్సయ్య, ఎల్.దుర్గాప్రసాద్, కె.శంకర్ రావు, ఎస్.నరేందర్, డి.ఆదిరెడ్డి, ఎం.కృపాసాగర్, సీహెచ్.పద్మిని, ఎ.భగవంత రెడ్డి, కే.ఆర్.ఎల్. రెడ్డి, జి.క్రిష్ణ, సుభాష్, కె. కాశిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.