Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) హయత్‌నగర్ సర్కిల్ కార్యదర్శి నర్సిరెడ్డి
నవతెలంగాణ-హయత్‌నగర్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అసలు సిసలైన వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని సీపీఐ(ఎం) సర్కిల్ కార్యదర్శి కీసరి నర్సిరెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల వాల్‌పోస్టర్‌ను లెక్చరర్స్ కాలనీ కమాన్ వద్ద సీపీఐ(ఎం) శాఖ ఆధ్వర్యంలో సర్కిల్ కార్యదర్శి కీసరి నర్సిరెడ్డి భీమనపల్లి కనకయ్య తదితరులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాటి నిరంకుశ నైజాం ప్రభుత్వానికి వ్యతిరే కంగా, కూడు, గూడు, గుడ్టలేని పేదలకు అండగా కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాటం జరిగిందన్నారు. భూస్వామ్య దొరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టులు వీరమరణం పొందారని, లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టుపార్టీ పేదలకు పంచిందని వివరించారు. బాంచన్ దొరా కాల్మొక్త అన్న చేతులతోటే తుపాకులు పట్టించి వీరోచినత పోరాటం జరిపింది కమ్యూనిస్టులేనన్నారు. ఈ పోరాటంలో అనేక మంది జైలు శిక్ష అనుభవించారని, కొంతమంది అయితే శిక్ష అనుభవిస్తూనే మరణించిన వాళ్లు ఉన్నారని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణకే పరిమితం కాలేదని, ఇది భారత దేశానికే దిక్సూచిగా, వీరోచిత పోరాటంగా చరిత్రలో నిలిచిందన్నా రు. ఇది కుల, మతాలకు అతీతంగా జరిగిన పోరాటమని అన్నా రు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగేటప్పుడు బ్రిటిష్ పాలకుల మోచేతి నీళ్లు తాగిన వారు, జైలు శిక్ష పడకుండా లొంగి పోయి తప్పించుకున్న వారు నేడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి మాట్లాడడం సిగ్గుచేటని బీజేపీని ఉద్దేశించి అన్నారు. హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టే విధంగా మతోన్మాదపార్టీ ప్రయత్నం చేస్తోందని, ఇది సరైనది కాదని అన్నారు. నిజంగా వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజానీకాని కి ఆనాడు జరిగిన వీరోచిత పోరాటంలో పాల్గొన్న నాయకత్వం ఎవరు ? ప్రాణాలు కోల్పోయింది ఎవరు? జైలు శిక్షలు అనుభవిం చింది ఎవరు? వారి నిజమైన వారసులు ఎవరో చెప్పాలన్నారు. సాయుధ పోరాట వారోత్సవాలు సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్ల్లాలో సెప్టెంబర్ 10న ఐలమ్మ వర్ధంతిరోజున ప్రారంభించామన్నారు. సెప్టెంబర్ 17న ఆరుట్లలో ముగింపు సభ ఉంటుందని, ఈ సభను జయప్రదం చేయాలని కోరారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్ర మంలో శాఖ కార్యదర్శి కృష్ణారెడ్డి, దోనూర్ సంజీవరెడ్డి, పిసాటి నర్సిరెడ్డి, సిహెచ్ కష్ణయ్య, జనార్దన్‌గౌడ్, వెంకటేష్‌గౌడ్, బి.రాణి, శైలజ, నక్కపోతుల శ్రీను, కుమార్, వెంకట్, సీనియర్ నాయకులు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.