Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- పెన్షన్ లబ్దిదారులకు గుర్తింపులు కార్డులు
నవతెలంగాణ-బేగంపేట్
దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్ర మాలు, పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ పెద్ద కొడుకు అయ్యారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమ వారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ఆసరా పెన్షన్ లబ్ద్దిదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావంకు ముందు వృద్ధులు, వితంతువులకు రూ. 200, వికలాంగులకు రూ.500 పెన్షన్ ఇచ్చేవారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సహాయాన్ని రూ.2,016, రూ.3,016కు పెంచిందన్నారు. గత నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది అర్హులకు ప్రభుత్వం నూతనంగా పెన్షన్లను మంజూరు చేసిందని చెప్పారు. హైదరాబాద్ జిల్లాకు 77,695 నూత న పెన్షన్లు మంజూరైనట్టు తెలిపారు. ప్రభుత్వం అంది స్తున్న ఆర్ధిక సహాయాన్ని పెంచిన తర్వాత లబ్ధిదారులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పెన్షన్ డబ్బుల కోసం లబ్ధిదారులు అక్కడా.. ఇక్కడా తిరిగే వారనీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా నేరుగా లబ్ది దారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు చెప్పారు. పేదింటి ఆడపడుచుల పెండ్లికి రూ.లక్షా 116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. పేద ప్రజలు సంతోషంగా ఉండాలీ, గొప్పగా బతకాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. వైద్యం కోసం ప్రయివేట్ హాస్పిటల్లకు వెళ్ళి ఆర్ధిక ఇబ్బందులు పడొద్దనీ, ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిట ల్స్‌ను ఎంతో అభివృద్ధి చేశామనీ, అన్ని రకాల వైద్య పరీక్ష లు, చికిత్సలు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా బస్తీ దవాఖా నాలను అందుబాటులో ఏర్పాటు చేశామనీ, ఆక్కడ కూడా అవసరమైన ప్రభుత్వ వైద్య సేవలు పొందాలని చెప్పారు. కరోనా చికిత్సకు కేరాఫ్‌గా గాంధీ హాస్పిటల్ నిలిచిందనీ, ఇదే ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధి చెందాయని చెప్పడా నికి నిదర్శనం అన్నారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసిందనీ, ఉచి తంగా విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లను అందించ డమే కాకుండా నాణ్యమైన బోజన సౌకర్యం కూడా కల్పిస్తిన్నట్టు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకా లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్ర మంలో వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, కార్పొరేటర్లు మహేశ్వరి, హేమలత, మాజీ కార్పొరేటర్ లు ఆకుల రూప, ఉప్పల తరుణి, తహసీల్దార్లు శైలజ, అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.