Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి డివిజన్‌కు చెందిన 967 మందికి కొత్త పెన్షన్ కార్డులను మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని సక్రమంగా అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సునీత రాముయాదవ్, ప్రాజెక్ట్ అధికారి మల్లికార్జున్, నాయకులు సతీష్ కుమార్, పిట్ల శ్రీనివాస్, రామూయాదవ్, గుండా నిరంజన్, ఎస్ఆర్. ప్రసాద్, మోహన్ రెడ్డి, సంతోష్ రాందాస్, కన్నా, ఉపేందర్, గణేష్, సూరి, పివి.సత్యనారాయణ, గణేష్, ముదిరాజ్, బాలకృష్ణ, కిట్టు, తదితరులు పాల్గొన్నారు.