Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-బాలానగర్
ఉపాధ్యాయల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి, బాలానగర్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో - 2022 సోమవారం కూకట్పల్లి చిత్తారమ్మ దేవాలయ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై 30 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... దేశ భవిష్యత్తును మార్చగలిగే సత్తా ఉపాధ్యాయులకు మాత్రమే ఉందన్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి అన్ని పాఠశాలలను అత్యాధునిక సదుపాయాలతో అభివద్ధి పరచడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణం కోసం స్థలాలు కూడా కేటాయించామని చెప్పారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ దష్టికి తీసుకెళ్లి, పరిష్కరిస్తామని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఎంతోమంది నిరుపేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారంటే అది విద్యార్థులపట్ల ఉపాధ్యాయులు తీసుకుంటున్న శ్రద్ధ వల్లేనని, ఇందుకు వారు చేస్తున్న కషిని అభినందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, డీఈఓ విజయకుమారి, ఎంఈఓ ఆంజనేయులు, ఆయా మండలాల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.