Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలనీ అసోసియేషన్ పై కక్ష పూరితమైన వైఖరి
- కార్పొరేటర్ భర్తపై కాలనీ అసోసియేషన్ విమర్శలు
నవతెలంగాణ-బోడుప్పల్
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీఅండ్‌టీ కాలనీ అసోసియేషన్‌పై స్థానిక కార్పొరేటర్ తూంకుంట్ల ప్రసన్నలక్ష్మి భర్త శ్రీధర్‌రెడ్డి కక్షపూరితమైన వైఖరి పట్ల మేడిపల్లి పీఅండ్‌టీ కాలనీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారంనాడు మేడిపల్లి మండల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాలనీ అధ్యక్షుడు జక్క సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సత్తయ్యలు మాట్లాడుతూ.. గతనెల 21న కాలనీ నూతన కార్యవర్గ ఎన్నికల ద్వారా ఏర్పాటు అయ్యిందని, కాలనీ ఎన్నికల్లో కార్పొరేటర్ భర్త సూచించిన వ్యక్తి ఓటమిపాలుకావడాన్ని జీర్ణించుకోలేని అతను అసోసియేషన్‌పై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, ఎలాంటి సహకారం అందించడం లేదని వాపోయారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంలో జరిగిన లడ్డు వేలంలో పాల్గ్గొననివారి పేర్లను హాజరైనట్లుగా పత్రిక లో ప్రచురితం చేశారని, అదే విధంగా కాలనీవాసులు సంతోషంగా శోభాయాత్ర నిర్వహిస్తుంటే దానిని అల్లరిచేయాలని తన అధికార బలంతో బెదిరింపులకు దిగినట్లు వాపోయారు. కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యల పరిష్కారం గురించి ఏనాడూ శ్రద్ధపెట్టలేెదని, సమస్యలున్నాయని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగడం నిజమని శ్రీధర్‌రెడ్డి అన్నారు. కాలనీలో అక్రమ నిర్మాణాల వద్ద వేల రూపాయలు వసూళ్ళు చేయడమే కానీ, ఏనాడూ కాలనీ అభివద్ధికోసం పాటుపడిన సందర్భాలు లేవని అన్నారు. మరి కొన్ని రోజుల్లో కాలనీ సమస్యలు, అతని వసూళ్ల బండారం బయట పెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కోశాధికారి సి.హెచ్.కష్ణయ్య, బి.మెహన్‌రెడ్డి కాలనీ అసోసియేషన్ కొండా సాయిబయ, వేణుగోపాల్ రెడ్డి, బాల్ రెడ్డి, కౌడే ప్రభాకర్, మల్లారెడ్డి, బాల్దా పాండు, అర్.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
అసత్యపు ఆరోపణలే....
తన భార్య కార్పొరేటర్‌గా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్లోని వివిధ అభివద్ధి పనుల నిమిత్తం రూ.1.70లక్షల వరకూ నిధులతో పనులు చేయించడం జరిగిందని, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు తూంకుంట్ల శ్రీధర్‌రెడ్డి అన్నారు. కాలనీవాసుల ఆరోప ణలపై వివరణ అడగగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ అసోసి యేషన్ ఎన్నికైన నాటి నుండి నేటి వరకు మహిళా కార్పొరేటర్ అనే చులకనభావం వారికుందని, అందుకే ఏనాడూ అసోసియేషన్ అధ్వర్యంలో జరిగే ఉత్సవాలకు ఆహ్వానం అందించలేదని అన్నారు. కావాలనే మహిళా కార్పొరేటర్‌ను చిన్నచూపు చూస్తున్నారని, త్వరలోనే వారికి తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు.