Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆటోనగర్ హరిణ వనస్థలి పార్క్ నందు అటవీశాఖలో పర్యటించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-హయత్‌నగర్
మన్సురాబాద్‌లో ఉన్న ఆటోనగర్ హరిణ వనస్థలి పార్క్ నందు అటవీశాఖలో సోమవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి వాకర్స్‌తో కలిసి పర్యటిం చారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డికి పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దానిలో భాగంగా ఇట్టి ట్రాక్ నందు ఒకసారి చుట్టూ నడిస్తే దాదావు 5 కిలోమీటర్ల దూరం రావడం జరుగుతుందని తెలిపారు. కావున వాకర్స్ సభ్యులకు ట్రాక్ పక్కన అదనపు మూత్రశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అలాగే వాకింగ్ ట్రాక్ మధ్యలో పిచ్చి మొక్కలు పెరిగడం జరిగిందని తెలిపారు. కావున వాటిని తొలగించాలని సూచించారు. అలాగే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇట్టి గోడ వెనుక ఆటో నగర్ పారిశ్రామిక కేంద్రాలు ఉండడం వల్ల రాత్రి వేళలో ఇట్టి వాకింగ్ ట్రాక్‌లోకి వ్యర్థ రసాయనాలు వదలడం జరుగుతుందని తెలిపారు. దాంతో అందులో వుండే మొక్కలు చనిపోవడమే కాకుండా, వాకింగ్‌కు వచ్చే సభ్యులకు తీవ్రమైన ఘాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తప్పకుండ వాకర్స్ సభ్యులకు మూత్రశాలాలు, ఓపెన్ జీమ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే వాకింగ్ ట్రాక్ చుట్టుపక్కల, మధ్యలో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించడం జరుగుతుం దని తెలిపారు. అలాగే వ్యర్థ రసాయనాలు పారబోసే వాహనాలు గుర్తించడానికి అట్టి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇట్టి వాకింగ్ ట్రాక్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దు తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో మన్సురాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, అటవీశాఖ అధికారులు విజయానంద్‌రావు, విష్ణువర్ధన్, విద్యాసాగర్, సాయి వరుణ్, వాకర్స్ సభ్యులు లక్ష్మారెడ్డి, సునీల్ రెడ్డి, గుజ్జ జగన్, జైపాల్, సుధీర్ రెడ్డి, మధుసూదన్, దీపావళి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.