Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాటేదాన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
నవతెలంగాణ-సిటీబ్యూరో
పాదచారుల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 36 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించడానికి రూ.83 కోట్ల 16లక్షలు ఖర్చు చేస్తున్నట్లు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. సోమ వారం చార్మినార్ జోన్‌లోని రాజేంద్రనగర్ సర్కిల్ స్వప్న థియేటర్ కాటేదాన్ వద్ద రూ.3.50కోట్లతో చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌తో కలిసి మేయర్ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాటేదాన్ బ్రిడ్జీతో ఇప్పటి వరకు 7 ఫుట్ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి వచ్చాయ న్నారు. మరో 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు పురోగతిలో ఉన్నాయ న్నారు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వల్ల కాటేదాన్ పరిసరాల వారికి, సుమారు 5వేల మంది ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని, పాదచారులకు మేలు జరుగు తుందని చెప్పారు. కాటేదాన్ ఫుట్ఓవర్ బ్రిడ్జి 21మీటర్ల పొడవుతో ప్రజల సౌకర్యార్థం అధునాతనంగా నిర్మించారని, లిఫ్ట్ సౌకర్యం కల్పించడంతోపాటు రెండు సీసీ కెమెరాలను అమర్చినట్టు తెలిపారు.
రూ.33 కోట్లతో 12 జంక్షన్ల అభివృద్ధి
పాదచారుల ప్రయోజనం కోసం నగరంలో రూ.33కోట్ల అంచనా వ్యయంతో 12జంక్షన్లను వినూత్నంగా అభివృద్ధి చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అవసరమైనచోట పాదచారుల కోసం సిట్టింగ్ సౌకర్యం, సుందరీ కరణ పనులు చేపడుతున్నామని చెప్పారు. ఈ జంక్షన్ల అభివృద్ధి మంచి ఫలితాలనిస్తే మిగతా జంక్షన్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మైలార్ దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, చార్మినార్ జోన్ ఎస్ఈ నర్సింగ్‌రావు, ఎగ్జిక్యూ టివ్ ఇంజినీర్ నరేందర్‌గౌడ్, డిప్యూటీ కమిష నర్ రాజునాయక్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మేయర్ అప్పా చెరువు నుంచి జాతీయ రహదారి 44వరకు రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించే బాక్స్ డ్రెయిన్ పనులను పరిశీలించారు. డ్రెయిన్ పనులు 70శాతం పూర్తయి నందున మిగతా పనులు ఈనెల చివరి వరకు పూర్తి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.