Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
పర్యావరణ పరిరక్షణతో పాటూ ప్లాస్టిక్ ద్వారా కలుగుతున్న కాలుష్యాన్ని నివారించే దిశగా హోటల్ మెర్క్యూర్ హైదరాబాద్ కేసీపీ వారు సరికొత్త చర్యకు శ్రీకారం చుట్టారు. హోటల్లో తాగునీటిని అందించడానికి వినియోగిస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో నుంతంగా గ్లాసు బాటిళ్లను వినియోగించాలని నిర్ణయించారు.ఆల్కలైన్ మినరల్ వాటర్ మనిషి ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలియజేస్తూ మంగళవారం హోటల్లో ప్రత్యేకమైన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సంస్థ జీఎం సౌమిత్ర పహారి మాట్లాడుతూ ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం ద్వారా పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతుందని, కాలుష్య నివారణ చర్యల్లో అందరి భాగస్వామ్యం అవసరం అన్నారు.
ప్రస్థుతం హోటల్లో నెలకొల్పిన ఈ సరికొత్త వాటర్ ప్లాంట్ ద్వారా రోజుకి 300 లీటర్లను సరఫరా చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రమాకాంత్, గణేష్ గంగోణి, మహేష్ సాహూ, రామకష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.