Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమితి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్
నవతెలంగాణ-బంజారాహిల్స్
నగరంలో శాంతిర్యాలీ అక్టోబర్ 2న ప్రపంచ దేశాల నాయకుల ఆహ్వానంతో అంగరంగ వైభవంగా జరుగుతుందని ప్రముఖ శాంతి దూత, ప్రజా సమితి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ అన్నారు. మంగళవారం బేగంపేట టూరిజం ప్లాజాలో విలేకరు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు, జస్టిస్ చంద్రయ్య, విశ్రాంత ఐఏఎస్ రోశయ్య, టీడీపీ నేత ప్రసూన, మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రజా గాయకులు గద్దర్ హాజరై ప్రసంగించారు. శాంతి అన్నప్పుడు అందరినీ పిలవాలి అదే శాంతి కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని, ఎకనామిక్ సబ్మిట్కు తన వంతుగా కషి చేస్తానని గద్దర్ చెప్పారు. అందరమూ కలిసి పనిచేసినపపుడు దేశ రక్షణ, ప్రపంచ రక్షణ కోసం సఫలమౌతుందని మహిళలను రక్షించడం, వితంతువులకు కాపాడటం అవసరం వీరు ప్రపంచంలో 8 కోట్ల ఉన్నారని టీడీపీ నాయకురాలు కే ప్రసన్న తెలిపారు. ప్రపంచంలో పేదరికం, దరిద్రం, రోజురోజుకి పెరిగిపోతే మరికొందరికి మాత్రం సంపద ఎక్కువ అవుతోందనీ కే ఏ పాల్ అన్నారు. దేశ భవిష్యత్తు కోసమే తాను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని రాజకీయ ప్రమేయం లేకుండా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరి సహకారం అవసరమన్నారు. గాంధీ కూడా కర్ర, తుపాకీ లేకుండా స్వాతంత్య్రం తెచ్చారని, పాల్ ఆలోచన ప్రకారం శాంతి సభ కోసం అన్ని దేశాల వారు రావడం గర్వకారణం అని వీహెచ్ అన్నారు. సభకు మైనస్ పాలిటిక్స్ ఉండాలి కాని, ప్రజల్లోకి తీసుకెళలాల్సిన అవసరం ఉందని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రకతిని మనం ఎలా ఉపయోగించుకోవాలో ప్రధానం సంక్షేమమే కోసం వాడితే శాంతి, సౌభ్రాతత్వమ్ నెలకొంటుందని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు.