Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
డ్రయిజీ సమస్యలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్పేట కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్ అన్నారు. మంగళవారం చెన్నారెడ్డినగర్లో పర్యటించి డ్రయినేజీ సమస్యను పరిశీలించారు. వెంటనే సంబంధిత సిబ్బందిని పిలిపించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రయినేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లవంగు ఆంజనేయులు, దయాకర్ యాదవ్, సంతోష్చారి తదితరులు పాల్గొన్నారు.