Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాంతా బయోటెక్ అధినేత డా.కె.ఐ వరప్రసాదరెడ్డి
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న ప్రఖ్యాత సాహితీమూర్తుల పరిణతవాణి ప్రసంగాలు యువతకు స్ఫూర్తినిస్తాయని శాంతా బయోటెక్నిక్స్ అధినేత పద్మభూషణ్ డా.కె.ఐ.వరప్రసాదరెడ్డి అన్నారు. మంగళవారం డా.దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో ఏర్పాటు చేసిన పరిణతవాణి 101వ ప్రసంగ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అపజయం పాఠం నేర్పుతుందని, ఆ దశలో ఎదురైన అవమానాలు, ఆందోళనలు, బాంధవులు, సైంధవుల గురించి కూడా ప్రసంగాల్లో వివరిస్తే బాగుంటుందని సూచించారు. పరిణతవాణి ప్రసంగాలను ఎప్పటికప్పుడు సంపుటాలు రూపంలో అందిస్తున్నందుకు పరిషత్తును అభినందించారు. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ 1993లో డా.సి. నారాయణరెడ్డి అధ్యక్షులుగా ఉండగా పరిణతవాణి ప్రసంగాలను ప్రారంభించారని తెలిపారు. విద్యార్థులకు ఇవి పాఠ్య గ్రంథాలుగా ఉండదగినవని చెప్పారు. ప్రముఖ కవి, వ్యాఖ్యాత డా.ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ మాతామహులు కందుకూరి రామభద్రరావు, పితామహులు వేంకట పార్వతీశ్వర కవుల్లో ఒకరైన ఓలేటి పార్వతీశం, తండ్రి కవి శశాంకల స్ఫూర్తి తమలో ఉందని తెలిపారు. తొలుత ఆకాశవాణి తర్వాత దూరదర్శన్ తనలోని ప్రతిభను వెలికి తీశాయని, తెలుగు సాహిత్యం, కళా సంస్కతులు, ప్రతిభామూర్తుల ప్రజ్ఞా విశేషాలకు దశ్యశ్రవ్య మాధ్యమాల ద్వారా ప్రజల్లో విస్తత ప్రాచుర్యం కల్పించానని చెప్పారు. నామవిజ్ఞానంపై పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్నానని, గేయ కవితలు, విమర్శా: వ్యాసాలు పుస్తకాలుగా ప్రచురించానని పార్వతీశం చెప్పారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా. జె. చెన్నయ్య స్వాగతోపన్యాసం చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రముఖ విధ్వాంసులు ఆచార్య వేటూరి ఆనందమూర్తి పరిణతవాణి 102వ ప్రసంగం ఉంటుంది.