Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టిస్తామని బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ ప్రసాద్ అన్నారు. విద్యానగర్ బీసీ భవన్లో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య జన్మదినాన్ని బీసీ నేతల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య రాష్ట్ర కన్వీనర్‌గా లాల్ కృష్ణ ప్రసాద్ నియమించి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం లాల్ కృష్ణ మాట్లాడుతూ బీసీల కోసం 47 ఏండ్ల నుంచి నిర్విరామంగా పోరాడుతున్న మహానేతని ఆర్ కృష్ణయ్య అని కొనియాడారు. ఆయన చేసిన పోరాటాలకు నేడు సీఎం జగన్ మోహన్ రాజ్యసభ సభ్యుడు నియమించారని గుర్తు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం జనాభా ఎంత ఉంటే అంత వాటా రావాల్సి ఉంటుందన్నారు. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించే వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నీలం వెంకటేష్, బీసీ నేతలు, కార్యకర్తలు, బీసీ మహిళా మండలి రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శి, కన్వీనర్లు పాల్గొన్నారు.