Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షులు ఎల్.నాగరాజు
నవతెలంగాణ-ఓయూ
కులం పేరుతో దూషించిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఎస్సై స్రవంతి రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎంఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షులు ఎల్.నాగరాజు మాదిగ డిమాండ్ చేశారు. ఆమెను విధుల నుంచి తొలగించాలని కోరుతూ ఎంఎస్ఎఫ్, మాదిగ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం ఓయూ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా నేటికీ దళితులపై దాడులు, అవమానకరమైన అకత్యాలు, సంఘటనలు జరగటం బాధాకరం అని అన్నారు. నేలకొండపల్లిలో జరిగిన గణేష్ నిమజ్జనం సందర్భంగా అక్కడ కొందరి మాదిగ యువకులను ఎస్సై స్రవంతి రెడ్డి కులం పేరుతో దూషించారని చెప్పారు. మాదిగల మనోభావాలు దెబ్బతినేలాగా వ్యవహరించిన ఎస్సైపై తక్షణం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం చొరవ తీసుకొని ఆమెపై విచారణ చేపట్టి ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వరిగడ్డి చందు, కో ఆర్డినేటర్ చింతం తిరుపతి, ప్రధాన కార్యదర్శి గుమేడేల్లి తిరుమలేష్, హైదరాబాద్ అధ్యక్షులు కానుగంటి సురేష్, ఓయూ నాయకులు కొండ్ర కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.