Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఆంధ్ర మహిళా సభ అకాడమిక్ క్యాంపస్‌లోని విద్యార్థినులకు ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈసందర్భంగా ప్రొఫెసర్ సులోచన మాట్లాడుతూ అవని కంపెనీ, అమెరికాలోని టెస్లా వారి సౌజన్యంతో విద్యార్థినుల కోసం పర్యావరణ రహిత శానిటరీ ప్యాడ్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. వీటిని కాటన్, లీక్ ప్రూఫ్ మెటీరియల్‌తో తయారుచేశారని, వాడిన తర్వాత తిరిగి వాష్ చేసుకుని మూడేండ్ల వరకు వినియోగించేందుకు అనువుగా ఉంటాయని చెప్పారు. ఒకచిన్న సంచీలో ఆరు ప్యాడ్స్ ఉంటాయని, వీటిని సులువుగా హ్యాండ్ బ్యాగుల్లో పెట్టి తీసుకెళ్లే సౌకర్యం ఉందని చెప్పారు. సాధారణ సబ్బు నీళ్లలో వీటిని శుభ్రం చేసుకుని ఎండలో ఆర వేసిన తర్వాత మళ్లీ ఈ ప్యాడ్స్‌ని ధరించవచ్చు సూచించారు.