Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
సీఎం కేసీఆర్ అమలు పరిచిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు అన్నారు. మంగళవారం కూకట్‌పల్లిలోని ఎన్.ఆర్.సి గార్డెన్స్‌లో బాలాజీనగర్ డివిజన్‌కి చెందిన 1300 మంది లబ్దిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 57 ఏండ్లు పూర్తి చేసుకున్న వారికి ఆసరా పెన్షన్ స్కీమ్ ద్వారా అందించడం సంతోషంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ అరోరా సతీష్, బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.