Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్పేట
సమైక్యత వజ్రోత్సవ ర్యాలీలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆన్నారు. గురువారం అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో తహసీల్దార్ లలితతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పోరాట పటిమ, సంస్కతి, సంప్రదాయాలు, రాష్ట్ర అభివద్ధి, సంక్షేమాలు ఘనంగా చాటేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు అంబర్పేట అలీ కేఫ్ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ర్యాలీలో విద్యార్థులు, యువతీ, యువకులు, మహిళలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని సూచించారు.