Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ కవి వీఆర్ విద్యార్థి
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
భారత వాయు సేనలో ఒక సైనికునిగా పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో జరిగిన యుద్ధాల్లో వీరోచితంగా పాల్గొనడంతో పాటు కవిత్వంపై మక్కువతో మూడున్నర దశాబ్దాలుగా కవిత్వం కూడా రాస్తున్నానని ప్రముఖ కవి వి.ఆర్. విద్యార్థి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో జరుగుతున్న పరిణతవాణి ప్రసంగ పరంపరలో గురువారం ఆయన 103వ ప్రసంగం చేశారు. కాకతీయుల చారిత్రక గ్రామం ఓరుగల్లు సమీపంలోని గవిచెర్లలో 1945లో జన్మించిన తాను జిడ్డు కష్ణమూర్తి ఉపన్యాసాలతో ప్రభావితుడినయ్యానని, కాళోజీ సోదరులతో చివరిదాకా అత్యంత సన్నిహితంగా ఉండడమేగాక కవిత్వపరంగా వారి ప్రశంసలు అందుకున్నానని తెలిపారు. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ తెలుగు సాహిత్యంలో సైనికునిగా, కవిగా ఉన్నవారు అరుదని అన్నారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా. జె.చెన్నయ్య స్వాగతోపన్యాసం చేశారు. కోశాధికారి మంత్రి రామారావు, ఉపాధ్యక్షులు డా. ముదిగంటి సుజాతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం. 5 గంటలకు ప్రముఖ సాహితీవేత్త విహారి (జె.ఎస్. మూర్తి) పరిణతవాణి 104వ ప్రసంగం ఉంటుంది.