Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ హరీశ్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ పతాకావిష్కరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాలను విజయవంతమయ్యేలా చూడాలని సూచించారు. 17న జాతీయ పతాకాన్ని కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆవిష్కరించనున్న నేపథ్యంలో గురువారం కలెక్టర్ హరీశ్ అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, అనంతరం విద్యార్థులు, కళాకారులతో సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
ఆదివాసీ, గిరిజన సమ్మేళనం గోడపత్రిక ఆవిష్కరణ
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసేలా అధికారులు కషి చేయాలని కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో ఈనెల 17న హైదరాబాద్లో నిర్వహించనున్న ఆదివాసీ, గిరిజన సమ్మేళనం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 17న బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో నిర్మించిన కొమురమ్ భీమ్ ఆదివాసీ భవనంతో పాటు సేవాలాల్ బంజారా భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు జిల్లా నుంచి ఎస్టీ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సభ్యులను ఇప్పటికే ఎంపిక చేశామని, అలాగే స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా వెళ్తారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి కిరణ్ కుమార్, బాలానగర్ డీసీపీ సందీప్, ఆర్ అండ్ బీ ఈఈ శ్రీనివాస్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.