Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
దేశంలో ఏ రాష్ట్రంలో ఆమలుకాని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం అంబర్‌పేట పటేల్‌నగర్ చౌరస్తాలో కార్పొరేటర్ విజరు కుమార్‌గౌడ్, తహసీల్దార్ సీహెచ్.లలితతో కలిసి ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు, వద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పింఛన్లను అందజేస్తున్నారన్నారు. పింఛన్ల పంపిణీలో అవినీతికి చోటు లేకుండా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారని చెప్పారు. అనంతరం కార్పొరేటర్ విజరు కుమార్‌గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సహకారంతో రోడ్లు, డ్రయినేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి కషి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మండల ఆర్ఐ బీవీ మహేష్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్డ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జాఫర్, నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.