Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాటంలో లేనివారు సంబరాలు చేయడమా?
- చరిత్ర తెలుసుకొని తెలంగాణలో అడుగుపెట్టండి
- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ-బంజారాహిల్స్
హైదరాబాద్ రాష్ట్రం భారత్ యూనియన్‌లో విలీనమైన సెప్టెంబర్ 17 ముమ్మాటికీ జాతీయ సమైక్యత దినోత్సవమేనని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 'సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం కాదు-జాతీయ సమైక్యత దినోత్సవం' చర్చ, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల జేఏసీ చైర్మెన్ గజ్జలకాంతం, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజారామ్ యాదవ్, సీపీఐ నాయకులు పశ్యపద్మ, మేకపోతుల నరేంద్ర గౌడ్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ప్రొఫెసర్ కాసిం, బీసీ సంఘాల నాయకులు వెంకటేష్ గౌడ్ తదితరులు హాజరై ప్రసంగించారు. దేశాన్ని పాలిస్తున్న మోడీ, అమిత్ షా కేవలం తెలంగాణలో రాజకీయంగా లబ్ది పొందేందుకే ఈ విషయాన్ని లేవనెత్తుతున్నారని అన్నారు. దేశ స్వాతంత్య్రంలో ఎలాంటి పాత్ర పోషించని బీజేపీ ఈ అంశాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య వైషమ్యాలు సష్టించేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. బీజేపీ విద్వేషపూరిత కుట్రలను సమిష్టిగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ కుటిల ప్రయత్నాలను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రజలను సిద్ధం చేస్తామని అన్నారు. ఇది ఉద్యమాల గడ్డ అన్న విషయాన్ని బీజేపీ పెద్దలు మరవద్దని హెచ్చరించారు. సెప్టెంబర్ 17న రాష్ట్రానికి వస్తున్న అమిత్‌షాను విమానాశ్రయంలోనే అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరును నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నూతన సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల 26న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గజ్జలకాంతం చెప్పారు. సమావేశంలో ఓయూ జేఏసీ మందాల భాస్కర్, తెలంగాణ రాష్ట్ర దళిత సంఘ నాయకులు ఓబీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.