Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సికింద్రాబాద్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్
- జోనల్ కార్యాలయం ఎదుట నిరసన
నవతెలంగాణ-బేగంపేట్
జీహెచ్ఎంసీ నుంచి గుత్తేదారులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సికింద్రాబాద్ కాంటాక్ట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గురువారం కాంటాక్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గండికోట ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తాము చేసిన పనికి బిల్లులను ఇవ్వమంటే తమ వద్ద బడ్జెట్ లేదని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారని, తాము అప్పు తెచ్చి పనులు చేపించామని వాపోయారు. తమకు జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం రూ. 800 కోట్లు ఇప్పటికీ చెల్లించాల్సి ఉందన్నారు. అవి చెల్లిస్తేనే మిగతా పనులను ప్రారంభిస్తామని, అప్పటివరకు పనులు చేయకుండా నిలిపిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తమ పెండింగ్ బిల్స్ సమస్యలు తీర్చాలని వారు కోరారు.కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.విజరు కుమార్, శివరాత్రి శ్రీనివాస్, ఆర్ శ్రీనివాస్, కెఎం రాజు, ఎస్ వెంకటేష్, వి నర్సింహ, వీరేశ్, పి రాములు, ఎం.రాజు, అజాం తదితరులు పాల్గొన్నారు.