Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్, డిప్యూటీ మేయర్ హర్షం
నవతెలంగాణ-బంజారాహిల్స్/ఓయూ
స్వరాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బి అర్ అంబేడ్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం లిబర్టీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే ఎమ్మెల్సీ ప్రభాకర్, నగరవాసులతో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు ఆచరించాలని సూచించారు. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ మేయర్ కతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ నూతన సెక్రటేరియట్‌కు ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును ప్రకటించినందుకు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు కతజ్ఞతలు తెలిపారు. గురువారం తార్నాక డివిజన్లోని లాలాపేట్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహానికి, సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.