Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆత్మహత్యల నివారణపై రోషిణి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నెక్లెస్ రోడ్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నటి, యాంకర్ ఝాన్సీ, లేక్ పోలీస్ స్టేషన్ సీఐ మంజుల ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు. ఝాన్సీ మాట్లాడుతూ జీవితంలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్వోవాలన్నారు. సీఐ మంజుల మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎనిమిది నెలల కాలంలో 220 మందిని కాపాడామన్నారు. పీఎస్ పరిధిలో 24/7 పహారా ఉంటుందని, సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారని చాలా మంది చిన్న చిన్న కారణాలతో ప్రాంతాలతో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఆత్మహత్యకు పాల్పడటం సరైనది కాదన్నారు. కాపాడిన వారిని వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా అందులో రోషిణి ముఖ్యపాత్ర పోషిస్తుందని, ఉచితంగా కౌన్సెలింగ్ ఇచ్చి వారికో దారి చూపుతారని తెలిపారు. రోషిణి డైరెక్టర్ ఉషశ్రీ మాట్లాడుతూ ప్రతి ఏడాది సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవంగా నిర్వహిస్తారని, ఆత్మహత్యల నివారణే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందన్నారు. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 2021లో తెలంగాణ 10,171 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వారిలో 15-29 సంవత్సరాల మధ్యవారు ఉండడం బాధాకరమన్నారు. 1997 నుంచి తమ సంస్థ ఆత్మహత్య నివారణలపై పనిచేస్తుందన్నారు. ఈ ఏడాది 'క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్' అనే థీమ్‌తో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఆత్మహత్య ఆలోచన వస్తే వెంటనే 8142020044, 8142020033 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. తమను సంప్రదించిన వారి పేర్లు బయటకు రానివ్వకుండా గోప్యంగా ఉంచుతామని చెప్పారు.