Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతతత్వ నాయకుల ఎత్తుగడలను తిప్పికొట్టాలి
- ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్
- ప్రజలు సమైక్యంగా ఉండాలని పిలుపు
నవతెలంగాణ-ధూల్‌పేట్
గంగా-జమున సంస్కృతిని దెబ్బతీసేందుకే విమోచన వేడుకలు అని ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. శుక్రవారం పాతబస్తీ నూర్‌ఖాన్‌బజార్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం జరపడమంటే మానిన గాయాలపై కారంచల్లి, విద్వేషాలను రగిల్చి గద్దెనెక్కే కుట్రలు చేయడం మతతత్వ పార్టీలకు పరిపాటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మతతత్వ నాయకుల ఎత్తుగడలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ సహించరని అన్నారు. గంగా-జమున సంస్కృతిని పాడుచేసే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న హిందూ-ముస్లిమ్ భాయిభాయి సంస్కృతిని కాపాడుకోవాలని పజలకు విజ్ఞప్తి చేశారు. విమోచన దినోత్సవం పేరిట తెలంగాణ అలరు బలరు సంస్కృతిని, గంగా జమునా తహెజీబ్ వారసత్వాన్ని నాశనం చేసే కుట్రలను ప్రతిఘటించాలన్నారు. మతోన్మాద ఫాసిస్టు శక్తుల దుష్ప్రచార వలలో చిక్కకుండా, విజ్ఞతతో వ్యవహరించాలని అన్నారు. సామరస్య వాతావరణానికి ఆవగింజంత హాని కూడా కలగకుండా మతోన్మాద ఫాసిస్టు శక్తుల బారినుంచి దేశాన్ని రక్షించుకోవడం తెలంగాణ పౌరుల ముందున్న తక్షణ కర్తవ్యం అని చెప్పారు.