Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు గంధం మనోహర్
నవతెలంగాణ-సరూర్‌నగర్
ప్రభుత్వ వసతి గృహ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు గంధం మనోహర్ అన్నారు. ఆదివారం సరూర్‌నగర్ డివిజన్ లక్ష్మీనగర్‌లోని మలక్‌పేట్ 1 హాస్టల్‌ను సందర్శించి ప్రత్యక్షంగా పరిశీలించి విద్యార్థులతో వారి సమస్యలను, సౌకర్యాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఏదోవిధంగా తప్పదు అనే పరిస్థితిలో ఇబ్బందులతో విద్యాభ్యాసంను కొనసాగిస్తున్నారు అని అన్నారు. హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు చాలా సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం పెంచకుండా నాణ్యమైన భోజనము విద్యార్థులకు పెట్టడం ఎలా సాధ్యమవు తుందని ప్రశ్నించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు వెంటనే పెంచాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి .లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా కేవీపీఎస్ నాయకులు విద్యార్థులతో సహా ప్రభుత్వానికి తెలియపరచే కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు .ముఖ్యంగా హాస్టల్ విద్యార్థుల టాయిలెట్స్ క్లీనింగ్ కొరకు ప్రతి హాస్టల్లో ఒక స్కావెంజర్ వెంటనే నియమించాలని, బాత్రూమ్స్ క్లీన్‌గా లేకుంటే విద్యార్థులు అనారోగ్యానికి గురి అవుతున్నారు. దాని కారణంగా విద్యార్థులు చదువుపై ఏకాగ్రత చదువుపై శ్రద్ధ వహించలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ఆలోచించి హాస్టల్లో ఉన్న విద్యార్థులందరూ మన రేపటి భావి భారత భవిష్యత్తు పౌరులుగా గుర్తించి హాస్టల్ విద్యార్థుల సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సరూర్‌నగర్ సర్కిల్ కెేవీపీఎస్ కార్యదర్శి మేకల కృష్ణ, ఎం.వీరయ్య, చైతన్య, తదితరులు నాయకులు పాల్గొన్నారు.