Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట/కుత్బుల్లాపూర్
శెట్టిబలిజ కులంతో పాటు బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలోకి చేర్చా లని తెలంగాణ శెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు దొమ్మేటి సత్యనారాయణ, సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధి లోని చింతల్ ఏరియా గణేష్ శెట్టిబలిజ యువజన సమా ఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఉన్న వారిని అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం తీవ్ర అన్యాయమనీ, దీనివల్ల విద్యార్థులు స్కాలర్షిప్ లు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే సభ శెట్టిబలిజ కులస్తులను బీసీ జాబితా చేర్చాలని ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు. తమ కులస్తులు ఎన్నికల్లో ప్రభుత్వానికి అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు గుత్తుల మీరా కుమార్, చెల్లుబోయిన రమేష్, డివివి సత్యనారాయణ, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, గుబ్బల లక్ష్మీనారాయణ, గుబ్బల ప్రసాద్, పిల్లి నాగబాబు, గుబ్బల రవి, చింతపల్లి వెంకటేశ్వరరావు, దూనబోయిన శివ, గుబ్బల సత్యనారాయణ, బొంతు వెంకటేశ్వరరావు, శీలం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.