Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని నంది నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, జయచం ద్రారెడ్డి, స్థానిక నాయకులు, మహిళలతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. సందర్భంగా కార్పొరేటర్ మాట్లా డుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు తప్పనిసరిగా నాటాలనీ, నాటిన ప్రతి మొక్కనూ కాపాడుకునే బాధ్యత తమదేనని తెలిపారు. ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా, అన్ని రకాల అనువైన ప్రదేశాలను గుర్తించి, మొక్కలు నాటాలనీ, నాటిన మొక్కను తప్పనిసరిగా రక్షించుకునే సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నంది నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంక్షేమ సంఘం సభ్యు లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.