Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య, చిట్యాల ఐలమ్మ త్యాగాలను, వీరోచిత పోరా టాన్ని చిట్టెలుకంత పోరాటమని కించపరుస్తూ వ్యాఖ్యా నించిన బీజేపీ నాయకుడు ప్రకాష్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఆదివారం శ్రీ శ్రీ నగర్ పార్టీ కార్యక్రమంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు సీపీఐ(ఎం) పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ బాలానగర్, కూకట్ పల్లి మండలాల కార్యదర్శులు ఐలాపురం రాజశేఖర్, ఎం.శంకర్ మాట్లా డుతూ ప్రసార మాంద్యామాల్లో ప్రకాష్ రెడ్డి చిట్టెలుకల పోరాటమని విద్వేషపూరితంగా వ్యాఖ్యానించడం రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ దేశాలు గుర్తిస్తుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆనాటి వీరోచిత పోరాటాన్ని కించపరచడమేనన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నదనీ, బీజేపీ చరిత్రను వక్రీకరించడమే పనిగా పెట్టుకుంటుందన్నారు. దొడ్డి కొమురయ్య మరణం తెలంగాణ సాయుధ పోరాట మొదటి అమరుడనీ, ఆయన స్ఫూర్తితో నైజాం, ఇసు నూరు రామచంద్రారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాల్లో భాగస్వామ్యమై చిట్యాల ఐలమ్మ వీర పోరాటం మహిళలలో చైతన్యం మొదలైందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ప్రజలను ఐక్యం చేయడంలో ఐలమ్మ వీరోచిత పోరాటం చేసిందన్నారు. ఆ పోరాటాల ఫలితంగానే లక్షల ఎకరాల ను పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులకే దక్కుతుంద న్నారు. ప్రకాష్ రెడ్డి అహంకార పూరిత మాటలకు వ్యతి రేకంగా సామాజిక నేతలు, వామపక్ష పార్టీలు, తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీకీ తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రకాష్ రెడ్డి వెంటనే బహిరంగ క్షేమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అతని ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయ కులు శ్రీనివాస్, శ్రీకాంత్, యాదగిరి, చైతన్య, శ్రీధర్, పి.శంకర్, ధర్మ రావు, బాలరాజు పాల్గొన్నారు.