Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్
- 23న వరంగల్‌లో రాష్ట్రస్థాయి సమావేశం
నవతెలంగాణ-అడిక్‌మెట్
దళితబంధు పథకం నిజమైన లబ్దిదారులకు అందడం లేదు అని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. సోమవారం విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను ఆర్థికంగా ముందుకు తీసుకురావడానికి తీసుకవచ్చిన దళితబంధు పథకం నిజమైన లబ్దిదారులకు అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ముందుండి పోరాడి, జైలుకు వెళ్లింది మాదిగలే అని, ఇండియా టుడే, వికిలీక్స్ వంటి అనేక పత్రికల్లో కూడా ప్రచురితమయ్యాయని చెప్పారు. కానీ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో మాదిగలు ఇంకా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారనీ, మాదిగలకు వచ్చే వాటా దగ్గర తీవ్రమైన అన్యాయం జరుగుతుందనీ అన్నారు. దళితబంధు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల ద్వారా ఇప్పించడం వల్ల నిజమైన లబ్దిదారులకు చేరట్లేదన్నారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఎమ్మెల్యే ద్వారా కాకుండా జిల్లా కలెక్టర్‌తో వారి ఆర్థిక పరిస్థితులు అనుగుణంగా అసలైన లబ్దిదారులను గుర్తించి వారికి దళితబంధు ఇవ్వాలని అన్నారు. మాదిగల సమస్యల పట్ల ఈనెల 23న వరంగల్ జిల్లాలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరి వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్ వరిగడ్డి చందు, ప్రధాన కార్యదర్శులు తిరుమలేశు, శ్రీకాంత్, యూనివర్సిటీల అధ్యక్షులు జన్నరపు జీవన్, హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేంపటి శ్రీకాంత్, ఓయూ అధ్యక్షులు నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్, వినోద్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.