Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లారీ డ్రైవర్లకు, యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం
- పోలీసు అధికారుల హెచ్చరిక
నవతెలంగాణ -వనస్థలిపురం
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఆటోనగర్ లారీ యజమానులు, డ్రైవర్లతో అవగాహన కార్యక్రమాన్ని వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు సోమవారం నిర్వహిం చారు. అక్రమ పార్కింగ్, నో ఎంట్రీ టైమింగ్స్, హైవేలపై రాంగ్ పార్కింగ్, ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్‌లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ యజమానులతో పాటు డ్రైవర్లకు కూడా అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతోనే కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. రూల్స్ అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలకు అర్హులవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం ట్రాఫిక్ సీఐ ఎం.మహేష్, వనస్థలిపురం సీిఐ కె.సత్యనారాయణ, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నందారెడ్డి, పార్కింగ్ స్థలం ఇన్చార్జ్ బాల్‌రెడ్డి, ఓనర్ ఉమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.