Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగోల్
నాగోల్ డివిజన్లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాసగుప్త నోటుబుక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసగుప్త మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టిని సారించి విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని, దీంతో ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని అన్నారు. మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.వి.ఎఫ్ ప్రాజెక్ట్ చైర్మెన్ సీనియర్ ఉపాధ్యక్షులు కాంచన కృష్ణమూర్తి, కార్యదర్శి చంద్రశేఖర్ గుప్తా, పొలిటికల్ చైర్మెన్ బస్సు శ్రీనివాస్‌లతో పాటు ఐబీఎఫ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.