Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్
ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాననీ, పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సనత్నగర్ నియోజకవర్గ పరిధి లోని రాంగోపాల్ పేట డివిజన్లో గల కండోజీ బజార్లో మంత్రి అధికారులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి స్థానిక ప్రజలు పలు సమస్యలను విన్నవించగా, వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబం ధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమ వీధిలో రోడ్డు నిర్మించాలనీ, మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేయా లని కోరగా, నూతన సీవరేజ్ పైప్ లైన్ నిర్మాణం పూర్తయి ందనీ, మంచినీటి పైప్ లైన్ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేసిన అనంతరం రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టు స్థానిక ప్రజలకు వివరించారు. కమిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని విన్నవించగా, అవసరమైన ప్రతిపాదనలను రూపొందించి అందజేయాలని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు. తమ వీదిలో కిందకు వేలాడుతున్న తీగలతో ప్రమాదం పొంచి ఉన్నదనీ, తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరగా, వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిం చారు. ఇప్పటికే కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొం టున్న అనేక దీర్గకాళిక సమస్యలను పరిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంకా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మహత్మా గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి పనులను మరింత వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ముకుంద రెడ్డి, సుదర్శన్, వాటర్ వర్క్స్ రమణారెడ్డి తదితరులు ఉన్నారు.