Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల చిన్న చూపు చూపిస్తూ రావాల్సిన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో తగిన రిజర్వేషన్ కల్పించక పోవడం వల్ల బీసీ సామాజిక వర్గం వెనకబడిపోతుందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రొయ్యల కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మేడ్చల్ కలెక్టరేట్ అవరణలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో జంతువులు, పక్షులకు లెక్కలు ఉన్నాయి కానీ, బీసీ సామజిక వర్గానికి ఈనాటికీ జనగణ లేకపోవడం, జనగణన చేయకపోవ డం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు శ్రద్ద వహించి బీసీ కుల జనగనన చేపట్టి వారి జనాభా లెక్కల ప్రకారం పర్సంటేజిని బట్టి సంక్షేమ పథకాలు, అభివృధి కార్యక్రమాలు అమలు చేపట్టి వారిని ఆర్థికంగా, సామజికంగా, రాజకీయంగా, చైతన్యం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని బీసీ కార్పొరేషన్లో నాలుగేండ్ల క్రితం బీసీలు స్వయం ఉపాధి కోసం, సబ్సిడీ ఋణాల కోసం రూ.5 లక్షలా 37 వేల మంది దరఖాస్తు చేసుకుంటే ఏ ఒక్కరికీ ఈనాటి వరకు రుణాలు మంజూరు చేయలేదన్నారు. బీసీ సామజిక వర్గానికి కనీసం రూ.50 వేలు, రూ.లక్ష, రూ.2 లక్షలు కానీ మంజూరు చేయక పోవడం బీసీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి నిరోధకులాగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ లకు రుణాలు మంజూరు చేయాలనీ, బ్యాంకు లలో ఎలాంటి షరతులు లేకుండా గ్రౌండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు దళితబంధు ఇచ్చిన మాది రిగానే రాష్ట్ర జనాభాలో 56శాతంగా ఉన్నా బీసీ కుటుం బాలకు కూడా అర్హులైన బీసీలకు బీసీ బంధు ఇచ్చి ఆదు కోవాలని విజ్ఞప్తి చేశారు. స్వంత ఇండ్లు లేక కిరాయికి నివసిస్తున్న వేలాది మంది బీసీ కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ శ్యాంసన్‌కు మెమోరాండం అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ఉపాధ్యక్ష్యులు చంద్రయ్య, లొట్టి ఈశ్వర్, జిల్లా సహాయ కార్యదర్సులు కృష్ణ, మంగళంపల్లి తిరుపతి, జిల్లా నాయకులు పి.శ్రీనివాస్, డి.జంగయ్య, ఎం.డి సల్మా న్బేగ్, టి.రాములుగౌడ్, జి.ఎస్.బాబు, పి.ఎస్.కె. అబ్దు ల్ఘని, ఏ.సోమయ్య, కొంపల్లి యాదగిరి గౌడ్, బొమ్మల్ పల్లి వెంకటేష్‌యాదవ్, ఎన్.కృష్ణ యాదవ్ పాల్గొన్నారు.