Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
చిల్కానగర్ డివిజన్లోని ఎస్సీ సంక్షేమ సేవా సంఘం కమ్యూనిటీ హాల్లో, మహిళా భవన్లో డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత, ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమాదేవితో కలిసి మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్ ఆదేశాల మేరకు చిలుకనగర్ డివిజన్లోని ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బన్నాల గీత మాట్లాడుతూ మొదటగా డివిజన్లోని ప్రతి అక్కకు, చెల్లికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో కులాలకు అతీతంగా జరుపుకునే అతి పెద్ద పండుగలలో బతుకమ్మ పండుగ ఒకటి అని తెలిపారు. భారత దేశంలోనే పూలను పూజించే గొప్ప సంస్కతి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పండుగల యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి, ప్రతి ఇంటి ఆడపడుచు గుమ్మాన్ని తట్టి బతుకమ్మ చీరలు పంపిణీ చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కూడా సగర్వంగా పండుగలను జరుపుకునే సంస్కతిని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కల్పించారని తెలిపారు. చిలకనగర్ డివిజన్లోని ప్రతి మహిళ తన రేషన్‌కార్డు, ఆధార్ కార్డు చూపించి బతుకమ్మ చీరను తీసుకొని ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, బజార్ జగన్, ఎదుల కొండల్ రెడ్డి, మాసశేఖర్, కొక్కొండ జగన్, మహమ్మద్, పార్నంది నర్సింగ్ రావు అబ్బు బారు, ఆటో శీను, యాదగిరి ,పోచయ్య, సుధాకర్, అప్సర్, ప్రతాపరెడ్డి, బాలేందర్, బాణాల నారాయణరెడ్డి, శీను నాయక్, సుందర్, రామానుజం, ఉపేందర్, రాంచందర్, ఫోటో బాలు, శ్రీనివాస్‌గౌడ్, శ్రీకాంత్, శ్యామ్, బాలు, మహిళా అధ్యక్షురాలు సుభద్ర సరిత సైనాజ్ ఆండాలు లక్ష్మి సత్యవతి అంజలి తదితరులు పాల్గొన్నారు.