Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాప్రతినిధులను ప్రశ్నించిన కె.ఎం.ప్రతాప్
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
తెలంగాణ విమోచన దినోత్సవ, తెలంగాణ జాతీయ సమైక్య దినోత్సవ ఉత్సవాలు నిర్వహించడానికి వేదికలను ఏర్పాటు చేసుకొని జన సమీకరణ కోసం పాఠశాల విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. కొన్ని జిల్లాల్లో దురదృష్టవశాత్తు విద్యార్థులు ప్రమాదాలకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. మరి ఓటు హక్కు కూడా లేని విద్యార్థులను సభ ప్రాంగణం వద్దకు పిలుచుకొని జన సమీకరణలో భాగంగా విద్యార్థులను ఎండలో నిలబెట్టి కనీసం నీటి సౌకర్యం కూడా అందించకుండా రాజకీయ ప్రజాప్రతినిధులు నృత్యాలు చేస్తూ విద్యార్థులను పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులుచ రాజకీయ నాయకులు జన సమీకరణ చేతగాక విద్యార్థులను పిలుచుకొని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు? ఈ పరిస్థితిని కుత్బుల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల పదవ తరగతి విద్యార్థులు స్కూల్ డెవలప్మెంట్ కమిటీ వద్ద వాపోయారు. స్కూల్ డెవలప్మెంట్ కమిటీ వారు రంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కెఎం ప్రతాప్ దృష్టికి ఈ పరిస్థితిని వివరించగా...ప్రయివేట్ పాఠశాలలు గాని, ప్రభుత్వ పాఠశాలలు గాని వాటి యజమాన్యాలు విద్యార్థులను ఇటువంటి జన సమీకరణ సభలకు ఎట్టి పరిస్థితుల్లో పంపించకూడదని ప్రభుత్వం, ప్రయివేట్ స్కూల్ అసోసియేషన్ కమిటీలకు తెలియజేశారు.