Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహజ వనరులను కొల్లగొడుతున్న మైనింగ్ మాఫియాను మూసివేయాలి : ఎమ్మార్పీఎస్
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
మైనింగ్ జోన్లో భూముల కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా, కోట్ల రూపాయల విలువైన సహజ వనరులను కొల్లగొడుతూ, అక్రమంగా మైనింగ్‌కు పాల్పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ మైనింగ్ మాఫియాను మూసివేయాలని ఎమ్మార్పీ ఎస్ (టిఎస్) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, సద్దుపల్లి చౌరస్తాలో మైనింగ్ భూ నిర్వాసితులు గత 36 రోజులుగా భూ పరిహారం కోసం ధర్నా చేపడుతున్న విషయం విదితమే. రైతులకు సంఘీ భావంగా ఎమ్మార్పీఎస్ (టిఎస్) ఇబ్రహీం పట్నం ఇన్చార్జి నల్ల నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ (టిఎస్) జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వేముల సూర్యప్రకాష్ ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రసం గించారు. బండ రావిరాల గ్రామ రెవెన్యూ సర్వే నెం.268 లో భూములు కోల్పోయిన భూ బాధితులకు సంఘీభావంగా ఎమ్మార్పీఎస్ ధర్నాలో పాల్గొనడం జరిగిందని, వారి న్యాయమైన డిమాండ్‌ను తక్షణమే ప్రభుత్వం పరిష్కరిం చాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా పరిహారం కోసం పోరాటం చేస్తున్న రైతుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మైనింగ్ జోన్లో భూములు కోల్పో యిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున రైతుల తరఫున ఎమ్మార్పీఎస్ ఆధ్వ ర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మంచాల యాదగిరి, చిన్నబాబు, సుగుణమ్మ, సిహెచ్.రామస్వామి, సుధాకర్, లింగం, మల్లేష్ , ధనలక్ష్మి నరసింహ, యాదగిరి, కృష్ణయ్య, రాజు, శ్రీనివాస్, భాస్కర్, గణేష్, క్రాంతికుమార్ రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.