Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ-ఘట్కేసర్
ప్రభుత్వ ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపల్ శివారెడ్డిగూడలోని బందన్ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీిఆర్‌ఎస్ మున్సిపల్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్‌ఎఫ్‌సీనగర్ మాజీ సర్పంచ్‌లు కె.పెర్సిబాయి. కె.రాజేష్. మాజీ వార్డు సభ్యులు రహీం, నాయకులు కందకట్ల మాధవరెడ్డి, ఎజ్జల రాజేష్‌లతో పాటు మరికొంతమంది టీిఆర్‌ఎస్ పార్టీలోకి రావడంతో మంత్రి మల్లారెడ్డి వారికి గులాబీ కండువాలను కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు టీిఆర్‌ఎస్ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చామకూర భద్రారెడ్డి, ఘట్కేసర్, పోచారం మున్సిపల్ చైర్మెన్లు ముళ్లిపావని జంగయ్యయాదవ్, బోయపల్లి కొండల్‌రెడ్డి, వైస్చైర్మెన్లు పలుగుల మాధవరెడ్డి, రైతు సహకార సంఘం చైర్మెన్ సింగిరెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీపీ బండారి దాసుగౌడ్. రైతుబంధు సమితి మండల అధ్యక్షులు కొంతం అంజిరెడ్డి, సొసైటీ మాజీ చైర్మెన్ సార శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్‌లు ఓరుగంటి వెంకటేష్‌గౌడ్, కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్ రెడ్డి, కొమ్మగోని రమాదేవి, బండారి ఆంజనేయులుగౌడ్, కడపోల్ల మల్లేష్, జహంగీర్, కుతాడి రవీందర్, బేతాళ నర్సింగ్‌రావు, సింగిరెడ్డి సాయిరెడ్డి, సొసైటీ డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, ఉపసర్పంచ్ ఎల్సాని ఐలయ్య యాదవ్, టీఆర్ఎస్ పోచారం మున్సిపల్ అధ్యక్షులు మందడి సురేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నాగులపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్‌రెడ్డి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ, మహిళా విభాగం అధ్యక్షురాలు ఫైళ్ల అండాలు, నాయ కులు డొంకెని బిక్షపతి, మేకల నర్సింగ్‌రావు, చిలుకూరి గోపాల్‌రెడ్డి, కందులకుమార్, బద్దం జగన్మోహన్‌రెడ్డ్డి, బొక్క ప్రభాకర్‌రెడ్డి, మెరుగు నరేష్‌గౌడ్, పల్లె విజరుగౌడ్, అభిమన్యు తదితరులు పాల్గొన్నారు.